MLA Vedma Bojju Patel:చెడుపై మంచి సాధించిన విజయం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, ఖానాపూర్‌టౌన్‌
చెడుపై మంచి సాధించిన విజయం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఘ‌నంగా దసరా పండుగ ఉత్సవం

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటు న్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శ‌నివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామ్ లీలా మైదానంలోహిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా పండుగ ఉత్సవాలలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకా దసరా పండుగ అని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.సోమవారం జరగబోయే బతుకమ్మ పండుగను డీజే పాటలు కాకుండా పాత పద్ధతిలో పాటలు పాడుకుంటూ బతుకమ్మ పండుగ జరుపు కోవాలని సూచించారు. నియోజకవర్గ అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రావణాసుర దహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్స‌వ స‌భ్యులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *