సిరా న్యూస్,ఎన్టీఆర్;
ఎన్టీఆర్ జిల్లాలో 113 వైన్ షాపులకు గాను 5825 దరఖాస్తులు వచ్చాయి. వత్సవాయి మండలంలోని 96వ నెంబర్ షాపుకు అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చాయి. విజయవాడ ఎన్.ఏ.సీ కళ్యాణమండపంలో సోమవారం లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఎంట్రీ పాస్, ఆధార్ కార్డు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు.