సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం డిఎన్ రావు పేట గ్రామం వద్ద హైదరాబాదు నుండి ఏలూరు వెళుతున్న ఏపీ ఎస్.ఆర్ టి సి. ఏపీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది.. ప్రమాద సమయం లో బస్సు లో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు..
బస్సు యాక్సిడెంట్లో ఏలూరు కు చెందిన విమలా భాయి అనే మహిళ మృతి చెందగా మరికొంతమంది కి గాయాలయ్యాయి. గాయ పడ్డవారిని చింతలపూడి ఏరియా ఆసుపత్రి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.. బస్సు ప్రమాదనికి గల కారణాల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చింతలపూడి పోలీసులు..