బైకుపై ఉన్న వ్యక్తి మృతి
సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎన్ఎఫ్ సి నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుకి వెళ్లే దారిలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.