– నిమజ్జనం చేస్తుండగా వ్యక్తి గల్లంతు
– గాలించి మృతేదహం వెలికి తీత
– బషీరాబాద్ రెడ్డిగణాపూర్లో ఘటన
సిరా న్యూస్,వికారబాద్;
నవరాత్రి ఉత్సవాల్లో విషాధం జరిగింది. నిమజ్జనం ఉత్సవాల్లో చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతై మృతదేహాంగా లభ్యమయ్యాడు. ఈ సంఘంటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం రెడ్డిగణాపూర్ గ్రామాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్(40) నవరాత్రి ఉత్సవాల్లో జరిగిన నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. సమీపంలోని చెరువులో నిమజ్జనం చేస్తుండగా అశోక్ గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారం అందించి స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అశోక్ చెరువులో మృతదేహాంగా లభ్యమయ్యాడు. ఈ సంఘటన గ్రామంలో విషాధం నింపింది. బాధితకుటుంభీకులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.