సిరాన్యూస్, ఇంద్రవెల్లి
ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
దండారి ఉత్సవాల చెక్కులు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గల రైతు వేదిక భవనంలో 40 దండారి ఉత్సవాలకు సంబందించిన చెక్కులను గ్రామస్తులకు పంపిణీ చేశారు.ఈ ఎమ్మెల్యే సందర్బంగా మాట్లాడుతూ..ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ దండారి అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దండారి ఉత్సవాల నిర్వహణకు ప్రతి దండారికి 15వేల రూపాయల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దండారి ఉత్సవాలకు 1కోటి 50 లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,వివిధ గ్రామాల పటేళ్లు,తదితరులు పాల్గొన్నారు.