ITDA Project Officer Kushshubu Gupta: వసతి గృహ విద్యార్థులకు మెరుగైన విద్యనందించండి: ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కుష్షుబు గుప్తా

సిరాన్యూస్‌, ఉట్నూర్‌
వసతి గృహ విద్యార్థులకు మెరుగైన విద్యనందించండి: ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కుష్షుబు గుప్తా

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటిడిఎ పిఓ కుష్షుబు గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం వాంకిడి మండలంలోని (బాలికలు)ఆశ్రమ పాఠశాలను పిఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు . విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఉపాధ్యాయుల అటెండెన్స్ స్టాక్ రిజిస్టార్లను పరిశీలించారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల పచ్చి ఆకు కూరగాయల ఆహారాన్ని , గుడ్లు, పాలు రాగి మాల్టా అందించాలన్నారు సూచించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలనీ అన్నారు. నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు భోదించారు. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఔషధాల రిజిస్టార్ పరిశీలించి ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ఏమైనా మరమ్మతులు ఉంటే తమకి తెలియజేయాలనీ అన్నారు. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిలువకుండా చూడాలని సూచించారు.అనంతరం మంచిర్యాల జిల్లాలో చికిత్స పొందుతూన విద్యార్థుల ఆసుపత్రిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *