సిరాన్యూస్,ఉట్నూర్ :
మహిళల ఆర్థిక తోడ్పాటుకు ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కేబి కాంప్లెక్స్ లో కోడి పిల్లల పెంపక కేంద్రం ప్రారంభం
మహిళలను పారిశ్రామికవేతలుగా తీర్చిదిద్ది, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకాన్ని ప్రారంభించిందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్ లో ఇందిరా మహిళ శక్తి కోడి పిల్లల పెంపక కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా కోడి పిల్లల పెంపక కేంద్రాన్ని పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. మహిళా సాధికారీత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని,స్వయం సహాయక గ్రామ సమాఖ్య సంఘాలలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళ శక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఇందిరా మహిళా శక్తి కేంద్రాలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తుందని,మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.మహిళలు ఇందిరా మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకొని,ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఆర్డిఓ సాయన్న, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.