MLA Vijaya Ramana Rao: త్వ‌ర‌లోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ : ఎమ్మెల్యే విజయ రమణారావు

సిరా న్యూస్,ఓదెల
త్వ‌ర‌లోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ : ఎమ్మెల్యే విజయ రమణారావు
ఓదెలలో డబుల్ బెడ్ రూమ్ లు పరిశీల‌న‌

త్వ‌ర‌లోనే అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తామ‌ని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కోలనూర్ గ్రామంలో సోమవారం రోడ్ వెడల్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజ‌రై ప‌నుల‌ను ప్రారంభించారు. అనంత‌రం మండల కేంద్రంలో ఆర్టిజన్ కాలనీ దగ్గర ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పరిశీలించారు. ఈసంద‌ర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 144 బెడ్ రూమ్ లను  ఓదెల గ్రామంలోని ఇల్లు, జాగా లేని నిరుపేదలకు  రెండు నెలలో పంపిణీ చేస్తానని అన్నారు. రైతు వేదికలో రైతులకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లోని పేరు తప్పులు ఉన్నవారికి ఉన్నవారిని రైతు రుణమాఫీ కోసం దరఖాస్తులు పరిశీలించారు. ఆర్టిజన్ కాలనీ వాసుల మేరకు ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రహరి గోడ నాలుగు లక్షలతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. డీ 86 కెనాల్ నుండి జూనియర్ కాలేజీ వరకు సీసీ రోడ్డు నిర్మిస్తానని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ జగదీష్, గ్రామ కార్యదర్శి చంద్రారెడ్డి, ఎస్ఐ అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బోడకుంట లక్ష్మీ చిన్నస్వామి, శంకరయ్య, చీకట్ల మొండయ్య, కీర్తన రాజారాం పొత్కపల్లి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ సుమన్ రెడ్డి, ఇందుర్తి శ్రీనివాస్, చింతం స్వామి, గోపతి సదానందం, గడిగొప్పుల సంతోష్, మీనుగు సంతోష్, బండారి కుమారస్వామి , నాగపురి రవికుమార్, తీర్థాల రాజా రామ్. వీరన్న, పిట్టల ఎం.డి సర్వర్ , విజేందర్ రెడ్డి, కొలనురు మాజీ సర్పంచ్ సామ శంకర్, బైరి రవికుమార్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *