సిరాన్యూస్, ఓదెల
అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుడిగా విజయరమణారావు
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుడిగా నియామకమయ్యారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్బంగా విజయ రమణారావుకుమాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ , శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజవేనా సదయ్య యాదవ్ , జిల్లా ఉపాధ్యక్షులు ఎం డి మున్నీర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు దేవేందర్, రమేష్, శ్రీనివాస్, శివ, రవి తదితరులు ఉన్నారు.