సిరా న్యూస్, ఓదెల
ఆలయంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు: ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని చీకటి తోట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం లో భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బోర్ వెల్ కు మోటారు వాటర్ ట్యాంక్ నిర్మించారు. శనివారం ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్సాంగారెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓదెల మండలంలోని దేవాలయాలు భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల సదుపాయాలు ఎమ్మెల్యే విజయ రమణ రావు ఆధ్వర్యంలో కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి , ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపిటిసిలు బోడకుంట లక్ష్మీ చిన్నస్వామి, శంకరయ్య, అల్లం సతీష్, మీనూగు సంతోష్, చింతం స్వామి, బండారి కుమారస్వామి, పిట్టల నర్సింగం గోపతి సదానందం, రాపల్లి రాజయ్య.ఆసంశెట్టి వెంకటేష్, గడిగోప్పల సంతోష్, వంగ రాజమల్లు నాగపురి రవి, మార్కా రవి కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు.