MLA Vijayaramana Rao: సమస్యలు పరిష్కరించేందుకు కృషి: ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరాన్యూస్‌, ఓదెల
సమస్యలు పరిష్కరించేందుకు కృషి: ఎమ్మెల్యే విజయరమణ రావు
* సీఎంఆర్ఎఫ్ , కళ్యాణ లక్ష్మిచెక్కులు పంపిణీ

పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చిన నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక సహాయం కింద సీఎం స‌హాయ‌ నిధి చెక్కులను ఓదెల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 147 మంది లబ్ధిదారులకు రూ.36,79,500 విలువ గల సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు. అనంత‌రం ఓదెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛదనం- పచ్చదనం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఓదెల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులను సిఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 36,79,500 /- (ముప్పై ఆరు లక్షల డేబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ) విలువ గల సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది అని అలాగే గత బి.అర్.ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫి పెద్ద బోగస్ అని విమర్శించారు..పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా 1,50,000 వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగిందని మిగిలిన రైతులకు కూడా ఆగస్టు 15 తారీకు లోపు, రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మొత్తం మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. 2014 సంవత్సరంలో ఏర్పాటైన బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని, బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో,రైతులు పండించిన వడ్లను రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కమిషన్ల రూపంలో రైతుల రక్తాన్ని తాగారని అన్నారు. దేశంలో ఉన్న బిజెపి పార్టీ కూడా ఏ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని, అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని అన్నారు. దాదాపు 31 వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు.త్వరలోనే నిరుపేద కుటుంబాలకు నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఉగాది వరకు ఓదెల గ్రామం నుండి పెగడపల్లి గ్రామం వరకు త్వరలోనే డబల్ రోడ్డు మంజూర్ చేస్తానని అన్నారు అలాగే ఓదెల నుండి మల్లికార్జున స్వామి దేవస్థానం వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు .నాలుగున్నర సంవత్సర కాలంలో ఓదెల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి, ఎమ్మార్వో యాకన్న, ఎంఈఓ, జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్.ఎం పద్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల సాగర్ రెడ్డి , సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, గోపు నారాయణరెడ్డి, ఐలయ్య యాదవ్, విజయేందర్ రెడ్డి, చీకట్లో మొండయ్య, బోడకుంట శంకర్, గడిగొప్పుల సంతోష్, చింతం స్వామి, తీర్థాల వీరన్న, అల్లం సతీష్ , సామ శంకర్, అంబాల కొమురయ్య, పిట్టల రవికుమార్, నర్సింగం, కాంగ్రెస్ మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *