సిరాన్యూస్, ఓదెల
కార్మికుల సంక్షేమం కోసమే కాటమయ్య రక్షణ కవచం : ఎమ్మెల్యే విజయరమణ రావు
గౌడ కార్మికుల సంక్షేమం కోసమే కాటమయ్య రక్షణ కవచమని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల కోసం ప్రతిష్టత్మాకంగా పంపిణీ చేస్తున్న కాటమయ్య సేఫ్టీ కిట్లను ఓదెల మండల కేంద్రంలో సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని తాటి వనంలో గౌడన్నలకు తాటి చెట్టు ఎక్కే కాటమయ్య రక్షణ కవచాలతో (సేఫ్టీ కిట్స్) శిక్షణ తరగతులను ఎక్సైజ్ శాఖ అధికారులతో స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. అనంతరం తాటి చెట్టును సేఫ్టీ కిట్టు ద్వారా ఎలా పైకి ఎక్కవచ్చునో ప్రభుత్వం నుండి వచ్చిన ట్రైనర్ ఎమ్మెల్యే తో కలిసి గౌడన్న లకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కి,గౌడన్నలకు కాటమయ్య రక్షణ కవచంతో ట్రైనర్ చెట్టును ఎక్కి చూపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ గౌడన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. కాటమయ్య రక్షణ కవచం తాటి చెట్లు ఎక్కడం కోసం సేఫ్టీగా ఉన్నాయని గౌడ సోదరులు శిక్షణ తీసుకొని చెట్లు ఎక్కాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని గౌడన్నల కోసం చక్కటి ఆలోచనతో కాటమయ్య కిట్లను అందిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గౌడన్నల కోసం తాటి చెట్లు ఎక్కే పరికరాలను పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఉన్న పరికరాలను వాటి విధివిధానాలను గౌడన్నల కోసం కాటమయ్య రక్షణ కవచం ఏర్పాటుకు సహకరించిన బుర్ర వెంకటేశం కి కృతజ్ఞతలు తెలిపారు. గీత వృత్తిని నమ్ముకొని తాటి చెట్లు ఎక్కుతు చెట్టు పైననే ప్రాణాలు కోల్పోతున్న గౌడన్నల కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలను అందించి టెక్నికల్ కిట్టు ద్వారా ప్రాణాలు కోల్పోకుండా ఉండటం జరుగుతుందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల అభివృద్ధి కోసం ముందు చూపుతో ఉందని అన్నారు.కార్యక్రమంలో గౌడ సోదరులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.