సిరాన్యూస్,ఓదెల
ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని జీలకుంట గ్రామానికి చెందిన నల్ల శ్రీనివాస్ రెడ్డి, కనగర్తి గ్రామానికి చెందిన కుందారపు రాజయ్య లకు విద్యుత్ ప్రమాదంతో మరణించారు. దీంతో విద్యుత్ శాఖ ద్వారా బాధితులకు ప్రమాద భీమా కింద ఒకరికి రూ. 5,00,000 /- ల చెక్కులు మంజురయ్యాయి. ఈ చెక్కులను గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు (మొత్తంగా 10,00,000/-) విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.