సిరాన్యూస్, ఓదెల
రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే విజయరమణ రావు ఘన స్వాగతం పలికారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం మీదుగా రోడ్డు మార్గంలో వస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కి, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి , ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కి రాష్ట్ర సలహాదారులు హరికర వేణుగోపాల్ కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ల కు పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కి రాష్ట్ర మంత్రులకు పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.