సిరా న్యూస్,మైలవరం;
వరదల్లో ఉన్నప్పుడు ఇంట్లో కాకుండా నడుములోతు నీళ్లలో ఉండి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిస్థితిని పరిశీలించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలని ఇటు అధికారులకు అటు ప్రజలకు సమన్వయం చేసారు.
పెన్షన్ పంపిణీ ఆగకూడదని పంపిణీ అనంతరం ఎంత వరద వచ్చినా ప్రజలతోనే ఉంటూ ఎప్పటికప్పుడు అధికారులను ప్రజలకు దగ్గర ఉండేలాగా లోతట్టి ప్రాంతాలు ప్రజలను తరలించాలని ఆదేశించారు. ప్రజలు కూడా బయటకు రాలేని పరిస్థితిలో ఒక స్థానిక ఎమ్మెల్యే నడుములోకి నీళ్లలో దిగి వరద ప్రాంతాలను పరివేక్షిస్తూ పెన్షన్ పంపిణీ చేస్తూ ప్రజలకు దగ్గర అవడం ప్రజలు చూసి ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.