ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

సిరా న్యూస్,పెద్దపల్లి;
రంజాన్ పార్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల వద్దకు వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి అలాయ్ బాలయ్ తీసుకున్నారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. మతసామరస్యా నికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనం అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్స్, మైనారిటీ మత పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
=========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *