సిరాన్యూస్, బోథ్
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి : ఎంఎల్హెచ్పీ అనుషా
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంఎల్హెచ్పీ అనుషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పలు కాలనీల్లో గురువారం రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్త ప్రమీల, అంగన్వాడీ టీచర్ వచ్చల, వసత, సత్యబామ పాల్గొన్నారు.