సిరా న్యూస్,దేవరకొండ;
మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు తప్పిపోవడం పట్ల బిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చి తల్లితండ్రులకు అప్పగించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అద్వానంగా మారుతున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు,ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి వుంది. గురుకులాల అధ్వాన్న పరిస్థితికి,విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న నువ్వే బాధ్యుడివి. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయి. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలి. మొద్దునిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని అన్నారు.