సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లలో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో విబిఆర్ మొబైల్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 5 లక్షల మేర నష్టం జరిగినట్లు షాప్ నిర్వాహకుడు లోక్యతండా కు చెందిన వడిత్య రాంబాబు తెలిపాడు. వికలాంగుడు అయినప్పటికి కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా మొబైల్ షాప్ నడుపుతున్నారు. బాబుకు ఒకసారిగా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.