సిరా న్యూస్, ఆదిలాబాద్
ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన
మార్చి 4 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అదిలాబాద్ రానున్న సందర్భంగా గురువారం జిల్లా పాలనాధికారి రాహూల్ రాజ్ , జిల్లా ఎస్పీ గౌస్ అలాం, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, శాసన సభ్యులు పాయల శంకర్ లతో కలసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం , హెలిప్యాడ్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులు ఆర్ అండ్ బి, మున్సిపల్ కమిషనర్ లను ఏర్పాట్ల పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.