సిరా న్యూస్,సికింద్రాబాద్;
రాష్ట్ర అభివృద్ది, రాష్ట్రం అప్పుల నుండి బయట పడడానికి బీజేపీ కి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు..
విజయ సంకల్ప యాత్ర విజయవంతం కోసం సికింద్రాబాద్ లో బీజేపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాసమ్ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ యాత్ర యొక్క ప్రాధాన్యతను గురించి వివరించారు. కేంద్రంలో మళ్ళీ మోడీ అధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎప్పుడో నిర్ణయం అయిపోయిందని తెలిపారు. ఇదే విషయాన్ని అన్ని సర్వేలు, ప్రజలు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందింది ఈ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్తితి లేదని, రాష్ట్ర హితం కోరే బీజేపీ కే ఓటు వేయాల్సిన అవసరాన్ని ఈ యాత్ర ద్వారా ప్రజలలోకి తీసుకు వెళుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఓటు వేసినా లాభం లేదని ఆ పార్టీ రద్దయిన 2వేల నోటుతో సమానమని వెల్లడించారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ కార్యదర్శి శ్యామ్ సుందర్ గౌడ్ యాత్ర యొక్క రూట్ మ్యాప్ ను వివరించారు.