తెలంగాణ బీజేపీదే
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే నని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక మీటింగ్ అయన దిశా నిర్దేశనం చేసారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ అందుకే బీఆర్ఎస్ అవినీతి పై కాంగ్రెస్ వెనకడుగు వేస్తున్నది. బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పనిచేస్తలేదు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి. నా బూత్లో నేను గెల్వాలి అనేలా పనిచేయండి. రైతులు, రైతు కూలీలు,యువత మహిళలను చైతన్య పరచండని అన్నారు.