మోడీకి 76 శాతం మద్దతు

సిరా న్యూస్,న్యూఢిల్లీ;
భారత ప్రధాని నరేంద్ర మోదీ హవా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో నరేంద్ర మోదీ టాప్‌లో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్‌ అనే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలోనే అగ్ర దేశాలకు చెందిన నాయకులను వెనక్కి నెట్టి మరీ మోదీ మొదటి స్థానంలో నిలిచారు.ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ కలిగిన నాయకుల్లో ప్రధాని మరోసారి ముందువరుసలో చోటుదక్కించుకున్నారు. ఏకంగా 76 శాతం మంది ఆమోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. డిసెంబర్‌ 7వ తేదీ డేటా ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. నవంబర్‌ 29 నుంచి డిసెబర్‌ 5వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు.ఈ రేటింగ్‌ ప్రకారం మోదీ తర్వాత 66 శాతం ప్రజాదారణతో మెక్సికో ప్రధాని అండ్రిస్‌ మాన్యుయల్ లొపేజ్‌ ఆబార్డర్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో స్విట్జార్లాండ్ ప్రధాని అలైన్ బెర్సెట్ 58 శాతం ఆమోదంతో మూడో స్థానంలో నిలిచారు. ఇక 49 శాతం మంది ఆమోదంతో బ్రెజిల్‌ ప్రధాని.. లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా 4వ స్థానంలో నిలిచారు. ఇక 47 శాతంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 5వ స్థానంలో ఉన్నారు. ఇటలీకి ప్రధాని జార్జియా మెలోని 6వ స్థానంలో నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *