సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో సమస్యలపై ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు పాశవికంగా జరిపిన దాడిలో అన్నదాత శుభ్ కరణ్ సింగ్ మృతికి మోడీ బాధ్యత వహించాలి AIKS. CITU *ఈరోజు సుందరయ్య ఆఫీస్ లో ఈ సమావేశానికి ఎపి రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు అధ్యక్షుత అబ్దుల్ నిర్వహించారు. ఎపి రైతు సంఘం పట్టణ కార్యదర్శి లక్ష్మినరసయ్య విలేఖర్లతో మాట్లాడుతూ రైతు ఉద్యమం పట్ల ప్రధాని మోడీ వైఖరి మారకపోతే గుణపాఠం తప్పదని, తక్షణమే రైతులను చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధరల చట్టం తీసుకురావాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు. దుర్మార్గపు పద్ధతిలో దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈ దాడిలో 24 ఏళ్ల యువరైతు శుభ్ కరణ్ సింగ్ తీవ్ర గాయాలై మరణించారని పేర్కొన్నారు. రైతాంగ ఉద్యమంపై పోలీసులు చేస్తున్న దమనకాండను తట్టుకోలేక ఇప్పటికే ఇద్దరు రైతులు గుండె ఆగి మృతిచెందారని తెలిపారు. రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరిన రైతుల ఉసురు తీస్తోందని విమర్శించారు. అలాగే మృతి చెందిన రైతు శుభ కరణ్సింగ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశంలో రైతు సంఘం నాయకులు అందురు ఏకం కావాలని డిమాండ్ చేశారు. *ఈ కార్యక్రమంలో సిఐటుయు అధ్యక్షులు కార్యదర్శి గోవిందు, రాముడు, KVPS చర్మంకారుల జిల్లా అధ్యక్షుడు ఆంథోనీ, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, వలి, పాల్గొన్నారు.