Money Donation: శిశివు వైద్యం కోసం రూ. 10 వేలు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

ఖానాపూర్, సిరా న్యూస్ 

రూ. 10  వేలు సాయం అందించిన ఎమ్మెల్యే 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అంబేద్కర్ కాలనికి చెందిన మగ్గిడి విజయలక్ష్మి నవజాత శిశువు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని ఖానాపూర్ లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను కలసి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. నేడు(గురువారం) హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అంత బిజీ షెడ్యూల్ లో కొంత సమయాన్ని వెచ్చించి స్టానిక నాయకులకు ఫోన్ చేసి నవజాత శిశువు తల్లికి రూ.10వేలు చికిత్స చేయించుకోవడానికి ‘ఫోన్ పే’ చేయగా వారు ఆ శిశువు ఇంటికి వెళ్లి పరామర్శించి శిశువు తల్లికి అందించారు. మంచి ఆసుపత్రికి వెళ్లి మెరుగైన చికిత్సలు చేయించుకోవాలని ఎమ్మెల్యే ఆశిశువు కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోకినేని దయానంద్, ప్రధాన కార్యదర్శి షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్,అమానుల్లా ఖాన్,3వ వార్డ్ కౌన్సిలర్ జన్నారపు శంకర్, కంఠం రవి,నాయకులు రాజేందర్, శేషాద్రి, రాజేశ్వర్,జహిర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *