వారం రోజులుగా అదే నీటిని సరఫరా
సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ – కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో కోతి కళేబరం దొరికింది. నీరు వాసన రావడంతో అనుమానం వచ్చి ట్యాంక్లో చూడగా కోతి కళేబరాన్ని చూసి గ్రామస్థులు కంగుతిన్నారు. వారం రోజులుగా అదే నీటిని అధికారులు సరఫరా చేయడంతో.. కలుషిత నీటిని సరఫరా చేసిన అధికారులపై గ్రామస్థులు మండిపడుతున్నారు.