సిరా న్యూస్,సూర్యాపేట;
నూతనకల్ మండల కేంద్రంలో కోతులు భీభత్సం సృష్టించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో కోతులు ఊరిని రౌండప్ చేసేసాయి. రెండు గ్రూపులుగా వీడిపోయి.. రచ్చ చేసిన వానర యుద్ధం కిష్కిందకాండ ను తలపించింది. సుమారు రెండు గంటల పాటు అరుపులు, కేకలతో నానా హంగామా చేసాయి. వందల సంఖ్యలో కోతులను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ దాడి చేస్తాయోననీ హడలి పోయారు. చివరకు పట్టణ వాసులంతా ఏకమై కర్రలతో ప్రతిఘటించడంతో.. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాయి.
అప్పటికే పలు ఇండ్లపై రేకులను ధ్వంసం చేసి గ్రామస్థులకు కొంత ఆస్తి నష్టం మిగిల్చింది వానర సైన్యం.