సిరా న్యూస్,కమాన్ పూర్;
నైతికతే నిజమైన స్వేచ్చా అని ఆయిషా సిద్దిఖా- మహిళా విభాగం ఉద్యమ కన్వీనర్ అన్నారు. సోమవరం 5 ఇంక్లైన్ కాలనీ లో ఉద్యమ ముగింపు , స్త్రీల సమావేశంలో వారు మాట్లాడుతూ నైతికతే నిజమైన స్వేచ్ఛ.. దాని వల్ల కలిగే మేలు
మనం నైతికత కలిగి ఉంటే సరైన నిర్ణయాలు తీసుకొనే శక్తి సామర్థాలు కలిగి ఉంటాం. అలాంటి నిర్ణయాలు మన చక్కని భవిష్యత్తుకు పునాదిని ఏర్పరుస్తాయి. వ్యక్తులు, సమాజాలు నైతిక విలువలను పాటిస్తే సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. దీని ద్వారా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకొంటూ జీవించే పరిస్థితులను సృష్టించుకోవచ్చు. మనం నైతిక విలువలకు కట్టుబడితే మన ధార్మిక బాధ్యతలను మరింత శ్రద్ధగా నిర్వహించవచచ్చు. మనమంతా నైతిక విలువలు పెంపొందించుకొంటే సమాజంలో సమానత్వం, దయ, జాలి గుణాలు పెరుగుతాయి. నిజమైన స్వేచ్ఛ అపరాధ భావన, సామాజిక ఒత్తిళ్లు, నైతిక గందరగోళం నుండి మనకు విముక్తిని కలిగిస్తుంది. మనం సంతృప్తికరమైన, అర్ధవంతమైన జీవితాలను గడపడానికి వీలు కల్పిస్తుంది. నైతికత మనలో అభద్రతను తొలగిస్తుంది. ఉన్నతంగా ఆలోచించే సద్గుణాన్ని ప్రసాదిస్తుంది.
మితిమీరిన స్వేచ్ఛ, విశృంఖలత్వం వల్ల కలిగే దుష్పరిణామాలు
మితిమీరిన స్వేచ్ఛ, విశృంఖలత్వం వివాహేతర సంబంధాలకు, వివాహేతర లైంగిక సంబంధాలకు, స్వలింగ సంపర్కాలకు, మాదక ద్రవ్యాల సేవనానికి దారి తీస్తుంది. ఇవి మన భావోద్వేగాలను, మానసిక, శారీరక ఆరోగ్యాలను దెబ్బ తీస్తాయి. ఈ దుర్గుణాలు మొత్తం సమాజాన్ని అస్థిరపరుస్తాయి. మీతిమీరిన స్వేచ్ఛ వల్ల కోరికలకు నియంత్రణ లేకుండా పోతుంది. ఈ క్రమంలో నైతిక విలువలన్నీ విస్మరించబడతాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బ తింటుంది. రక్త సంబంధాలు, మానవ సంబంధాల పవిత్రత తగ్గిపోతుంది. సమాజంలో ఒకరి పట్ల ఒకరికి అప నమ్మకం ఏర్పడుతుంది. సమాజంలో అస్థిర వాతావరణం ఏర్పడుతుంది. నీతివంతులు సైతం భౌతికవాదులుగా మారిపోతారు. నగ్నత్వం, అశ్లీలత, మద్యపానం కూడా స్వేచ్ఛగా భావించబడతాయి.
స్వేచ్ఛ పేరుతో మహిళలు ఎలా మోసపోతున్నారు?
పాశ్చాత్య సంస్కృతి చెప్పే స్వేచ్ఛ పేరుతో మహిళలు మానసిక బానిసత్వంలోకి నెట్టి వేయబడుతున్నారు. “నా శరీరం, నా ఎంపిక” అనే తప్పుడు నినాదానికి ఆకర్షితులై తమ కుటుంబాలను, నీతి నియమాలను, వినయాన్ని, స్వచ్ఛతను విస్మరిస్తున్నారు. సంతోషాలను బయట వెతుక్కుంటున్నారు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. పిల్లల కోసం తల్లి త్యాగాలు ఎందుకు చేయాలి అని ఆలోచించే స్థాయికి దిగజారుతున్నారు. తమ స్త్రీ తత్వాన్ని అవమానంగా భావించి పురుషులుగా మారాలని ప్రయత్నించే స్థాయికి దిగజారుతున్నారు. సంప్రదాయ వస్త్రధారణపై ఆసక్తి తగ్గించుకుంటున్నారు. ఆధునిక, కురచ దుస్తులపై ఆసక్తి పెంచుకొంటున్నారు. స్త్రీ – పురుషుల మధ్య తగిన దూరం ఎందుకు ఉండాలి? లైంగిక సంబంధాల కోసం వివాహం అవసరమా? అనే హీనమైన ఆలోచనలు చేసే స్థాయికి వస్తున్నార నీ వారు తెలిపరు – **ముస్లింల కోసమే కాకుండా
సర్వమానవాళికి రుజమార్గం చూపేందుకు ప్రవక్త ** ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం – వచ్చారని శ్రీమతి సబీరా నాజ్ – అధ్యక్షురాలు –
అన్నారు.వారు మాట్లాడుతు ఆయన బోధనలు మానవాళికి దిశానిర్దేశం చేశాయన్నారు. పేదలను ప్రేమించడం, మహిళల పట్ల గౌరవంగా ఉండాలని తెలిపరు. కార్మికవర్గం హక్కులపై కూడా తన బోధనలో పొందుపర్చారనీ వెల్లడించారు. కార్మికున్ని కూలికి తీసుకున్నప్పుడే తన కూలిని నిర్ణయించాలని, పనిచేసిన తర్వాత శ్రమకు తగిన వేతనాన్ని చెల్లించాలని ప్రవక్త తనబోధనల్లో క్లుప్తంగా వివరించారని తెలిపారు- జమాత్ ఇ ఇస్లామీ హింద్ – ఉద్యమ కన్వీనర్-శ్రీమతి ఆయిషా సిద్దిక్వా , సొసైటీ సేవలు, సంగం బలోపేతానికి నేను ఆకర్షితురాలినై అసోసియేట్ గా కొన సాగుతున్ననని శ్రీమతి పుష్పలత యోగా టీచర్ -హెల్త్ వెల్‌నెస్ కోచ్ వారి అభిప్రాయం తెలియ చేసారు