సిరా న్యూస్,మెదక్;
మద్యానికి బానిసై కన్నతల్లిని హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేటలో జరిగింది. మద్యానికి బానిసైన కొడుకు రామచంద్రం అర్ధరాత్రి తల్లి దుర్గవ్వతో పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గోడవపడ్డాడు. తన దగ్గర డబ్బులు లేవని తల్లి ఎంత చెప్పినా మాట వినంలేదు కొడుకు. నిన్ను చంపేస్తానని తల్లి గొంతు నులిమాడు. అనంతరం చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.