సిరా న్యూస్,మేడ్చల్;
చెంగిచర్ల బాధిత మహిళలతో ఎంపి బండి సంజయ్ మాట్లాడారు. ముస్లిం మతోన్మాదుల దాడిలో గాయపడ్డ బాధిత మహిళలను పరామర్శించారు. బాధిత మహిళల ముఖంపై తీవ్ర గాయాల పాలుండటంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలని కూడా చూడకుండా ఇంత ఉన్మాదంగా దాడులు చేస్తారా అంటూ మండి పడ్డారు. స్తానికుల మీరు రావడంతో మాకు కొండంత ధైర్యం వచ్చిందని చెప్పారు. నిన్నటి వరకు తమను తమ ఇండ్లల్లో ఉండనీయకుండా బయటకు పంపిస్తున్నారని మహిళలు వాపోయారు. నమాజ్ టైంలో తమను ఇండ్ల నుండి బయటకు పంపించి వేస్తున్నారనిఅన్నారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు తమను గుంజుకుపోయి వాతలు పడేలా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గర్భిణీలని కూడా చూడకుండా గొరగొర పోలీస్ స్టేషన్ కు గుంజుకుపోయి కొట్టారని మహిళలఉ వాపోయారు,. హోలీ పండుగ రోజు పాట పెట్టినందుకు తమను దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. దాడులకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. వాళ్లకు కఠిన శిక్ష పడేదాకా పోరాడతామని అన్నారు.