సోనాల, సిరా న్యూస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా సోనాలలోని రామాలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని శుభ్రం చేసి మొక్క నాటారు. కార్యక్రమంల బోథ్ మండల బీజేపీ అధ్యక్షుడు సుభాష్ సూర్య, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ చైర్మన్ జీవీ రమణ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాళ్లబండి మహేందర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.