సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ పార్లమెంట్ ఎం.పి కేశినేని శివనాథ్ బుధవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలిశారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్బంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తో కలిసి కేశినేని శివనాథ్ పూలబోకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.