సిరా న్యూస్, ఓదెల
ఈనెల 5 నుంచి ‘స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం: ఎంపీడీఓ జీ తిరుపతి
ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ జీ తిరుపతి అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రజా పరిషత్ కార్యాలయములో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారి అధ్యక్షతన గ్రామ స్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు నా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో యం ఆర్ ఓ యాకన్నా, యండి షబ్బీర్ పాష, యంపీఓ సబెజ్ ఖాన్, ప్రభుత్వ వైద్యులు, ఓదెల గ్రామ ప్రత్యేక అధికారులు లతా మంగేశ్వరి, ఏపీఎం, ఏఎన్ఎం లు, టీఏలు, సీసీ, ఐకేపీ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.