సిరాన్యూస్, సామర్లకోట
ఆధార్ శిబిరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ హీమ మహేశ్వరి
ప్రతి ఒక్కరూ ఆధార్ శిబిరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ హీమ మహేశ్వరి అన్నారు .మంగళవారం సామర్లకోట మండలంలో ఏర్పాటు చేసిన ఆధార్ శిబిరాలను మండల ప్రజా పరిషత్ అధికారిని హిమ మహేశ్వరి ప్రారంభించారు. ఈశిబిరాలను పనసపాడు,అచ్చంపేట గ్రామాలలో ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఎంపీడీఓ హీమ మహేశ్వరి మాట్లాడుతూ
నూతన ఆధార్ కార్డులు ఎన్‌రోల్, బయోమెట్రిక్ అప్డేట్, డేమోగ్రాఫిక్ అప్డేట్, ఆధార్‌కార్డు డౌన్‌లోడ్, కలర్ ప్రింట్ మొదలైన సర్వీసులు చేయడానికి ప్రత్యేక ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు . కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.