సిరాన్యూస్,చిగురుమామిడి
మహిళల సమస్యల పరిష్కారానికి ‘శుక్రవారం సభ’ : ఎంపీడీవో ఖాజా మొయినోద్దీన్
మహిళల సమస్యల పరిష్కారానికి ‘శుక్రవారం సభ’ ఎంతగానో దోహదపడుతుందని ఎంపీడీవో ఖాజా మొయినోద్దీన్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామంలో శుక్రవారం అంగన్వాడి (1) కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఎంపీడీవో సభ యొక్క ముఖ్య ఉద్దేశంపై తల్లులకు వివరించారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం అలాగే గ్రామం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ‘ఆరోగ్య మహిళా’ కార్యక్రమంలో ప్రతి గురువారం మండల ప్రాథమిక వైద్యశాలలో మహిళలకు 52 రకాల పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా చేస్తున్నారని దీనిని ప్రతి మహిళ సద్వినియోగం చేసు కోవాలన్నారు. అంగన్ వాడి సెంటర్ లో గర్భవతులకు, బాలింతలకు ఇచ్చే ఆహారాన్ని సెంటర్ కు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో భోజనం చేయాలని. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాజేష్, పంచాయితీ కార్యదర్శి రమేష్, ఏఎన్ఎం స్వరూప రాణి, అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి, అనురాధ, సంపూర్ణ, ఇందిరా,అశాలు పద్మ, సరోజన, లక్ష్మీ, గర్భవతులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.