సిరాన్యూస్, చిగురుమామిడి
అధికారులను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలి : ఎంపీడీఓ ఖాజామైనుద్దీన్
* చిగురుమామిడిలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శుల నిరసన
నల్గొండ జిల్లాలో ఇటీవల సస్పెన్షన్ చేయబడిన ఎంపీడీవో,పంచాయతీ కార్యదర్శులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం చిగురుమామిడి ఎంపీడీవో కార్యాలయం ఎదుట మండల ఎంపీడీఓ ఖాజామైనుద్దీన్, అన్ని గ్రామాల కార్యదర్శిలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా వారు సస్పెన్షన్ చేయబడిన అధికారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ గురి చేయడం సరైంది కాదని తప్పు పట్టారు.ప్రభుత్వ ఉద్యోగులను ఒత్తిడిలో గురిచేయడం సరైనది కాదని,స్వేచ్ఛ వాతావరణంలో విధులు నిర్వర్తించే అవకాశాన్ని కల్పించాలే తప్ప ఈ విధంగా సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.