సిరాన్యూస్, భీమదేవరపల్లి
స్పెషల్ డ్రైవ్ పనులను పక్కాగా నిర్వహించాలి: ఎంపీఓ నాగరాజు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఈనెల 25 నుంచి వచ్చేనెల 02 వరకు జరగనున్న పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మండల పంచాయతీ అధికారి నాగరాజు బుధవారం పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ముల్కనూర్ పోచమ్మ వాడ, ఎస్సీ కాలనీలో పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ పనులను పక్కాగా నిర్వహించాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు. బుధవారం చేపట్టిన పనుల్లో మురుగు కాలువలను శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించారు. గురువారం ముల్కనూర్ లోని ఎం సి ఆర్ బి గోదాం ఏరియాలో పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.