సిరా న్యూస్, జైనథ్:
ఓటేసిన ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ దంపతులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, తన సతీమణితో కలిసి స్వగ్రామమైన కూరలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్న ఎంపీపీ ఓటు వేసి బటకు వచ్చి, తన వేలి సిరా చుక్కను చూపుతూ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ద్వార లభించిన విలువైన ఓటు హక్కును ఎవరూ కూడ వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేసి, ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలని కోరారు.