MPP Jaianth: ఎంపీపీ, జడ్పిటీసీ, ఎంపిటీసీలకు ఘనంగా వీడ్కోలు

సిరా న్యూస్, జైనథ్‌:

ఎంపీపీ, జడ్పిటీసీ, ఎంపిటీసీలకు ఘనంగా వీడ్కోలు

ఎంపిటీసీలు, ఎంపీపీ, జడ్పిటీసీల పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో సభ్యులను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జడ్పిటీసీ తుమ్మల అరుంధతి వెంకట్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ సావాపూరే విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ… 5 ఏండ్ల పాటు పాలనలో సహకరించిన ఎంపిటీసీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలన చివరి రోజు సందర్భంగా తమను సన్మానించడం, తమ సేవలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిడీవో రవీంద్రనాథ్, తహాసీల్దార్‌ శ్యాంసుందర్, తదితరులు ఎంపిటీసీలు, ఎంపీపీ, జడ్పిటీసీ, వైస్‌ ఎంపీపీలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉనన్నత పదవులు అదిరోహించి, మరిన్ని ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ ముత్యం రావ్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన ఎంపీటీసీలు, అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *