Mrps Meeting: బేలలో ఎమ్మార్పీఎస్ సమావేశం…

సిరా న్యూస్, బేల:

బేలలో ఎమ్మార్పీఎస్ సమావేశం…

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఎమ్మార్పీఎస్ సమావేశం నిర్వహించారు. గురువారం వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కదరపు ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు మల్యాల స్వామి, వసంత్ పవార్, ఎల్పుల సంతోష్, లింగంపెల్లి రాజేశ్వర్, బిక్కి గంగాధర్, జెంజర్ల రాములు, తార రవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *