సిరాన్యూస్, ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్ర సాధనలో సీపీఐ పాత్ర కీలకం: సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధనలో సీపీఐ పాత్ర కీలకమని సీపీఐ జిల్లా ప్రధాన కార్య దర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేడు తెలంగాణ రాష్ట్రం 2014 వరకు జూన్ 2 వరకు పోరాడిందన్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ తోటి గెలిచిన కేసీఆర్ నేడు వారి నగ్న సత్యం బయట పడిందన్నారు. తెలంగాణ పోరాట యోధులకు చరిత్రలో గుర్తింపు లేకుండా చేయడం ఒక కేసీఆర్ కి దక్కిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నారని తెలిపారు. జూన్ 2న సిపిఐ పార్టీ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నలిని రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, ఎస్ అరుణ్ కుమార్, సిపిఐ సీనియర్ నాయకులు బెజ్జంకి, నర్సింగ్ రావు, అది వస గిరిజన సంఘం జిల్లా అధ్యక్షు లు గైడం పుచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.