సిరా న్యూస్, ఆదిలాబాద్
రామోజీరావుకు నివాళులర్పించిన సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం చెరుకూరి రామోజీరావు సంతాప సభను నిర్వహించారు. ఈసందర్బంగా చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామోజీరావు కృష్ణాజిల్లాలో పుట్టినప్పటికి హైదరాబాద్ కు జీవనోపాధి కొరకొచ్చి సీపీఐ పార్టీలో చేరారని తెలిపారు. కొన్ని సంవత్సరాల హైదరాబాద్ నగర సీపీఐ కౌన్సిలింగ్ సభ్యులు గా సాగారని చెప్పారు. ఆ తర్వాత 74 ఆగస్టు 10న విశాఖపట్నంలో ఈనాడు పేపర్ ప్రారంభించారని తెలిపారు. ఈనాడు పత్రిక తెలుగు రాష్ట్రాలే కాకుండా భారత దేశంలోనే ఒక గొప్ప పత్రికగా ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు ఈటీవీ అన్ని భాషల్లో తమిళ మలయాళం తెలుగు మరాఠీ హిందీ దేశంలో ఉన్న భాషలో అన్నిట్లోనూ ఈ టీవీ ఒక వెలుగు వెలిగిందని అన్నారు. అనంతరం వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బెజ్జంకి నర్సింగరావు , గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పోచ్చరంగెడం, సీపీఐ సీనియర్ నాయకులు కట్కోజి స్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జగన్నాథ్, బోయర్ గిరి దత్తు, సీపీఐ కార్యకర్తలు, అభిమానులు, కైలాష్ నగర్ మాజీ వార్డు సభ్యులు లక్ష్మణ్, ప్రజా కళాకారులు తదితరులు పాల్గొన్నారు.