సిరా న్యూస్, ఆదిలాబాద్
దొడ్డి కొమురయ్య ఆశయాలు సాధిద్దాం: సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
* ఘనంగా దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి
తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధిద్దామని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ సీపీఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడు పు ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. భూమి, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఆనాడు గొర్ల కాపరిగా పనిచేస్తున్న దొడ్డి కొమరయ్య ఈ అవినీతి అంతమందించడానికి పిడికిలి బిగించి రైతులందరిని చైతన్యం చేశారని తెలిపారు.ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై దొడ్డి కొమురయ్య స్పూర్తితో ఉద్యమించాలని తెలిపారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, ఎస్ అరుణ్ కుమార్. సీపీఐ సీనియర్ నాయకులు కట్ట కృష్ణ, స్వామి, బెజ్జంకి నర్సింగ్ రావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కంలే రామదాస్, బి కే ఎం యు జిల్లా అధ్యక్షులు ఖండాల గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పట్టణ అధ్యక్షులు టాబ్రెస్ ఖాన్ , ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.