Mudupu Prabhakar Reddy: నిషాన్‌ఘాట్ నిరుపేద‌ల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాలి : సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
నిషాన్‌ఘాట్ నిరుపేద‌ల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాలి : సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
* సీపీఐ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ఎదుట

ఆదిలాబాద్ మండలం లోని నిషాన్‌ఘాట్ నిరుపేద‌ల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట‌ ప్రజా సమస్యల పరిష్కార కోసం సీపీఐ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ధర్నానిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆదిలాబాద్ మండలం లోని నిశాన్ఘాట్ కాల‌నీ నిరుపేదలు దాదాపు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నార‌న్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేద‌న్నారు.ఆదిలాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిషాన్‌ఘాట్ కాలనీ వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంత‌రం జిల్లా కలెక్టర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. స్పందించిన క‌లెక్ట‌ర్ నిరుపేద‌ల‌కు న్యాయం చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నలిని, సీసీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, ఎస్ అరుణ్ కుమార్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్ఎఫ్ఐ అమీనా బేగం, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులుగెడం పొఛ్చ రామ్, బి కే ఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి అర్ధాంగి రమేష్, పుష్ప, షబానా, కృష్ణవేణి, మహబూబ్ ఖాన్, అమీర్ ఖాన్, సలీం ఖాన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *