సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఘనంగా ముగ్దుం మోహినుద్దీన్ జయంతి వేడుకలు
+ నివాళులర్పించిన ముడుపు ప్రభాకర్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ముగ్దుం మోహినుద్ధీన్ 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి ముగ్దుం చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాద్యాయుడిగా పనిచేస్తూ, ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం కోసం సంఘం స్థాపించిన ముగ్దుం, అనంతరం సీపీఐలో చేరి నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ అరుణ్ కుమార్, నాయకులు గణేష్, గణపతి, నర్సింలు, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.