సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రతిపక్షలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కేంద్ర సంస్థలు
* మోడీని దేశం నుంచి తరిమికొట్టే రోజులు వస్తాయి
* సిపిఐ జిల్లా ఆదిలాబాద్ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కేంద్ర సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని సిపిఐ జిల్లా ఆదిలాబాద్ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కేంద్ర సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీలని భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పార్టీలో చేరితే సత్య పూసలు లేకపోతే ఇతర పార్టీలోని అసత్యపూసలని బిజెపిలో ఉంటే సంసారి లేకపోతే వ్యభిచారి అన్న సామెత చందంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్, బిజెపికి నరేంద్రమోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అన్ని రోజులు ఏమి జరగలేదు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం తప్పు ఉందా లేకపోయినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ద్వారా గాని ఈడి లేదా సిబిఐ ద్వారా గాని ఐటి దాడులు గాని చేస్తా అన్నారు. ఇందులో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేయడం సమంజసమైనప్పటికీ కెసిఆర్ కుటుంబ సభ్యులందరూ అవినీతిలో కూరుకుపోయిన కాబట్టి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఈ అవినీతి బి ఆర్ ఎస్ నాయకులు కుటుంబాలు అవినీతి చేసి కోట్ల రూపాయల దండుకున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మునని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తెలుసు లేదా ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు. దాంట్లో ఎవరికి బాధ లేదు కానీ కేద్రీవాల్ అరవింద్ ఢిల్లీ ముఖ్యమంత్రి రెండు సార్లు బిజెపిని తరిమికొట్టి ఢిల్లీ ఎక్కినందుకు మోడీ గుండె పగిలిపోయే విధంగా చెంప చెడులను పార్టీ చూపడం జరిగిందన్నారు. నిన్నగాక మొన్న పంజాబ్లో ప్రభుత్వ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మరి మోడీకి మొగుడు అవుతాడని ఇలా బిజెపి ఇండియా కూటమి రేపు అధికారంలోకి వస్తే బిజెపి నరేంద్ర మోడీ బిజెపి నాయకులు అనేక మంది అక్రమాలు చేసిన వాళ్ళని జైల్లోకి ఒకటి తప్పదు అని చెప్పేసి ఇండియా కూటమిని విఛ్ఛనం చేయడానికి నరేంద్ర మోడీ బిజెపి నాటకం అందుకే అరెస్ట్ చేయడం సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందనన్నారు. ఇలాంటి సంఘటనలతోని దేశంలో రాజకీయ నేలితే ఒకనాడు పుట్టగతులు లేకుండా బిజెపి పోతాయని, ఎప్పటికైనా బీజేపీ అవినీతిని కమ్యూనిస్టులుగా దేశవ్యాప్తంగా పోరాడి భూస్థాపితం చేసే రోజులు పడతాయని ప్రజలకు రాంమందిరు రాముడు దేవుడు మందిర్లు మజీదుల పేరు మీద హిందూ ముస్లిం పేర్ల మీద రెచ్చగొడుతున్న తప్ప ఇది బలుపు మాత్రమే ఒకనాడు ప్రజలు తెలుసుకొని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అద్దంకి రమేష్, ఖండాల గణేష్, మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు