సిరాన్యూస్, బోథ్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముడుపు ప్రభాకర్ రెడ్డి
సీపీఐ జిల్లా నాయకులు, రైతు సంఘం నియోజవర్గం కార్యదర్శి, ఆదిలాబాద్ రిటైర్డ్ ఉపాధ్యాయులు చంద కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట మాజీ సిపిఐ జిల్లా కార్యదర్శి సుగం విటల్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, మాజీ సర్పంచ్ బత్తుల గంగారెడ్డి , సిపిఐ మండల మాజీ కార్యదర్శి ఆశంపూర్, సర్పంచ్ సాంబులు, రిటర్న్ ఉపాధ్యాయులు జంగిల్ దశరథ్, ఇతరులు పాల్గొన్నారు.