సిరాన్యూస్, ఆదిలాబాద్
భారత రాజ్యాంగ రక్షణకు ప్రజలందరూ సిద్ధం కావాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
భారత రాజ్యాంగ రక్షణకు ప్రజలందరూ సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో బీసీ భవన్ లో ని శనివారం సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో బిజెపి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో గత పది సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చినటువంటి లేనివిధంగా మతోన్మాదం దళిత గిరిజనులపై దాడులు చేస్తూ మైనార్టీ ముస్లిం క్రైస్తవులపై దేశాల నుండి ఎన్ ఆర్ సి సి ఏ అనుకుంటూ కొత్త చెట్టు భారత రాజ్యాంగాన్ని విస్మరించిందన్నారు. 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారని పేర్కొన్నారు.నీతి నిజాయితీగా పని చేసే వాళ్లపై జైల్లో పెట్టడం బిజెపికి అందుకే ఈ సదస్సులు ఒకటి నుండి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ వామపక్షాల సదస్సులు జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐఎం రాష్ట్ర నాయకులు రవికుమార్, సిపిఐ ఎం నాయకులు డి మల్లేష్, వెంకటరమణ ,ఎస్ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు అమీనా బేగం, సిపిఐ నాయకులు కోటల రాములు, సిపిఐ నాయకులు కోటల రాములు, బి కే ఎం యు జిల్లా కార్యదర్శి అద్దంకి రమేష్, గిరిజన సంఘం తెలంగాణ జిల్లా అధ్యక్షుడు గెడం పొచ్చి రామ్ ,తదితరులు పాల్గొన్నారు.