సిరాన్యూస్, ఆదిలాబాద్
అర్ధాంగి కిష్టన్నను పరామర్శించిన సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
సీపీఐ సీనియర్ నాయకులు అర్ధాంగి కిష్టన్న అనారోగ్య సమస్యలతో బాధుతూ గత నాలుగు రోజుల నుంచి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్నసీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి గురువారం రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి అర్ధాంగి కిష్టన్నను పరామర్శించారు. అర్ధాంగి కిష్టన్న ఆరోగ్యం మేలుకునే విధంగా చేయాలని డాక్టర్ రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్‌కు సూచన చేయగా వెంటనే మెరుగైన వైద్యం చేయించి కోల్కొనే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా డైరెక్టర్‌కు , ఇతర డాక్టర్లకు సీపీఐ జిల్లా కార్యదర్శి మూడుపు ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు అర్ధాంగి రమేష్, తదితరులు ఉన్నారు.